ఐద్వా నూతన కమిటీ ఎన్నిక

Jun 10,2024 19:58
ఐద్వా నూతన కమిటీ ఎన్నిక

ఐద్వా నూతన కమిటీ
ఐద్వా నూతన కమిటీ ఎన్నిక
ప్రజాశక్తి -నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని 30వ డివిజన్‌ వైఎస్‌ఆర్‌ నగర్‌ శాఖ ప్రాంతంలోని మల్లయ్య గుంటలో ఐద్వా నూతన కమిటీ ఎన్నికైంది. నూతన కమిటీ 9 మందితో ఏర్పడిందని ఐద్వా రూరల్‌ నాయకురాలు శంషాద్‌ పేర్కొన్నారు. సోమవారం శాఖ సమావేశం అనంతరం ఐద్వా శాఖ సభ్యులందరి అంగీకారంతో ఏకగ్రీవంగా అధ్యక్ష కార్యదర్శులుగా చంద్రకళ ఇంద్రజ కోశాధికారిగా ఉమా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐద్వా రూరల్‌ నాయకురాలు శంషాద్‌ పాల్గొని మహిళల హక్కుల సాధన కోసం ఐద్వా సంఘం చేస్తున్న పోరాటం, సాధించిన విజయాలు వివరించారు. వైఎస్‌ఆర్‌ నగర్‌ శాఖ కార్యదర్శి కండె కోటేశ్వరరావు, బీడీ కార్మిక సంఘం నాయకులు షబ్బీర్‌ ఉన్నారు.

➡️