ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : చింతకుంట, చిన్నదుద్యాల గ్రామాలకు సంబంధించి నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు,ఉపాధ్యక్షుల పదవులకు ఈనెల 14న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ వరద కిషోర్ రెడ్డి, ఇరిగేషన్ ఎఇ చంద్ర కిరణ్ తెలిపారు. వారు మాట్లాడుతూ చింతకుంట చెరువు ఆయకట్టు కింద ఉన్న చింతకుంట,యామవరం గ్రామాలకు సంబంధించి చింతకుంటలో 6 టిసిలు (ప్రాదేశిక నియోజకవర్గాలు)లకు పురుషులు 389,మహిళలు 184 మొత్తం 573 మంది ఓటర్లు ఉన్నారు.చిన్నదుద్యాలలో 6 టిసిలు (ప్రాదేశిక నియోజకవర్గాలు) పురుషులు 75,మహిళలు38 మంది మొత్తం 113 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల అధికారి అలవలపాటి.ముకుందా రెడ్డి, సహాయ ఎన్నికల అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి ఎన్నికల కేంద్రాలను పరిశీలించి నోటిఫికేషన్ వివరాలను సచివాలయంలో ప్రదర్శించారు.
