నీటి సంఘాల ఎన్నికలు సమర్థవంతం నిర్వహించాలి

ప్రజాశక్తి – బాపట్ల జిల్లా: నీటి సంఘాల ఎన్నికలు సమర్థంగా నిర్వహించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి తెలిపారు. నీటి సంఘాల ఎన్నికల ఎన్నికల నిర్వ హణపై జల వనరులు, రెవెన్యూ శాఖ అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయకట్టు భూములలో పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ ఓటు హక్కు ఉండాలని కలెక్టర్‌ చెప్పారు. డిసెంబర్‌ 8వ తేదీన నీటి సంఘాల ఎన్నికల నిర్వహ ణకు అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల అధికారుల నియామకం, తదితర ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాలన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సిసిఆర్‌సి కార్డుదారులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎన్నికల సందర్భంగా లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు రాకుం డా పోలీస్‌ యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలన్నారు. మండల స్థాయిలోని అధికారులకు డివిజన్‌ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాల న్నారు. ఐదో తేదీన ఎన్నికల ప్రకటన జారీ చేయాల న్నారు. డిసెంబర్‌ 8వ తేదీన నీటి సంఘాల ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలో 1,944 టెరిటోరియల్‌ కాన్‌స్టిట్యూషన్స్‌ ఉన్నాయన్నారు. ఇందులో ఒక్కొక్క సభ్యుడి ఎన్నిక జరగాలన్నారు. 170 నీటి సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరపాలన్నారు. డిసెంబర్‌ 11వ తేదీన 22 డిసి (కాల్వ కమిటీలు) ఎన్నిక జరుగుతుందని తెలిపారు. డిసెంబర్‌ 14వ తేదీన డబ్ల్యూడి (పశ్చిమ కృష్ణా డెల్టా) ప్రాజెక్ట్‌ కమిటీకి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. సమస్యలు ఉత్పన్నం గాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వర్‌, జల వనరుల శాఖ ఎస్‌ఈ అబూతలీమ్‌, ఈఈ వెంకటరత్నం, ఇంజినీరింగ్‌ అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.

➡️