ప్రజాశక్తి – గోపవరం ఎన్‌ఒసి (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) లేకుండా విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని పేదల కాలనీ వాసులు డిమాండ్ చేశారు. నో అబ్జె క్షన్ సర్టిఫికెట్ అవసరం లేకుండా పేదల కాలనీలకు విద్యుత్ మీటర్లను మం జూరు చేయాలని కోరుతూ సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎడిఇ కార్యాలయం ఎదటు పేదలు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎఇ మేరి షర్మిలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీను మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతాలైన సుందరయ్య కాలనీ, ఐలమ్మ కాలనీ, జ్యోతి బస్ కాలనీలు ఏర్పడక మునుపు ఆ ప్రాంతాలన్నీ నివాసానికి యోగ్యం కాకుండా ఉండేవని పేర్కొ న్నారు. రాళ్ల్లురప్పలు,కొండతిప్పలు,విష సర్పాలు సంచరిస్తున్న అడవిని తలపిస్తున్న ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలందరూ గుడిసెలు వేసుకొని అక్కడే స్థిరనివాసాలు ఏర్పర చుకున్నారని పేర్కొన్నారు. ఎలాంటి సౌకర్యాలు లేకున్నా సుమారు 20 ఏళ్లుగా ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం బద్వేలు పట్టణంలో విద్యుత్ మీటర్ల మంజూరు కోసం వారు దరఖాస్తు చేసుకుంటే ఇంటికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొస్తే మంజూరు చేస్తామని సంబంధితాధికారులు పేర్కొంటున్నారని చెప్పారు. రెవెన్యూ అధికారులు కనీసం కాలనీల వాసులకు పట్టాలు కూడా ఇవ్వలేదని, అలాంటప్పుడు వారికి ఎలా సర్టిఫికెట్లు వస్తాయని ప్రశ్నించారు. అధికారులు వారి ఇబ్బందులును దష్టిలో ఉంచుకొని మానవీయ కోణంలో ఆలోచించి స్థిరంగా నివాసాలు ఉన్న వారందరికీ ఎటువంటి షరతులు లేకుండా విద్యుత్తు మీటర్లు మంజూరు చేయాలని ,లేనిపక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ముడియం చిన్ని, షేక్ మస్తాన్ షరీఫ్, చెప్పలి సుబ్బరాయుడు, షేక్ కైరున్‌బీ, పసుపుల మోక్షమ్మ, శాఖా కార్యదర్శులు పి.సి కొండయ్య, మూర ప్రసాద్, షేక్ మస్తాన్ బీ,షేక్ ఆదిల్ పార్టీ కార్యకర్తలు నాగార్జున,గంప సుబ్బరాయుడు, వెంకటసుబ్బయ్య, బాలస్వామి, చంద్రకళ, అరుణ, సిద్ధమ్మ, పీరయ్య, శ్రీనివాసులు, ఫాతిమా, వెంకటపతి, బాబయ్య,యువరాజు పాల్గొన్నారు.
