దడ పుట్టిస్తున్న విద్యుత్‌ బిల్లులు

ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌ విద్యుత్‌ ఛార్జీల భారం మోయలేక జనం అల్లాడిపోతున్నారు. ఐదు నెలల నుంచి ఎఫ్‌టిపిసిఎ ఛార్జీలతో జనం బెంబే లెత్తుతున్నారు. ఛార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఎఫ్‌పిపిసిఎ పేరుతో వాడు కున్న విద్యుత్‌ కంటే 62 శాతం పైగా బాదుడు వేస్తున్నారు. ఛార్జీల పెరుగుదలతో వినియో గదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వం తప్పిదమంటూ కూటమి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. మరో వైపు ఈ భారమంతా కూటమి ప్రభుత్వానిదేనంటూ వైసిపి తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఒకరిపె ౖనొకరు ఆరోపణలు చేసుకుంటూ వినియో గదారుల నెత్తిన విద్యుత్‌ భారం మోపారు. వాడుకున్న విద్యుత్‌కు వస్తున్న కరెంటు బిల్లులకు ఏమాత్రమూ సంబంధం లేకుండా ఉండడంతో జనాలు లబోదిబోమంటున్న పరిస్థితి ఏర్పడింది. రూ.963 కరెంటు బిల్లులో ఫిక్స్డ్‌ ఛార్జీలు రూ .30, కస్టమర్‌ ఛార్జీలు రూ .45, ఎఫ్‌పిపిసిఎ రూ .413 (వై 22. 7.9), ఎఫ్‌పిపిసి ఎ. రూ . 35 ( 2023, 06), ఎఫ్‌పిపిసి ఎ. రూ . 35 (2025. 03), ట్రూ ఆప్‌ ఛార్జీలు రూ. 39 ఇలా అదనపు ఛార్జీల భారం రూ.605 ఉన్న పరిస్థితి నెలకొంది. 112 యూనిట్లకు బిల్లు రూ. 358 బిల్లు వస్తే అదనపు ఛార్జీలు రూ .605 జనం నెత్తిన రుద్దిన దుస్థితి కొనసాగుతోంది. జిల్లాలో 12 లక్షలకు పైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో మూడొంతుల విద్యుత్‌ కనెక్షన్లు సామాన్య ప్రజానీకానికి సంబంధించినవే. గత ఏడాది నవంబర్‌ నుంచి అదనపు కరెంటు బిల్లులతోనే జనం తీవ్ర ఆందోళన చెందగా ఏప్రిల్‌లో బిల్లులు మరింత షాక్‌ కొడుతున్న పరిస్థితి నెలకొంది. డిసెంబర్‌ నెలలో ఎఫ్‌ పిపిసిఎ (ప్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చస్‌ కాస్ట్‌ అడ్జస్టెట్మెంట్‌) ఛార్జీలు రెండు ఉండగా, జనవరి, ఫిబ్రవరి నెలలో భారాలు మరింత పెంచారు. దీంతో బిల్లులు మోత మోగు తున్న పరిస్థితి నెలకొంది. 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి విద్యుత్‌ పంపిణీలో అదనపు ఖర్చుల పేరుతో జనాలపై విద్యుత్‌ బిల్లుల బాదుడు తారాస్థాయికి చేరింది. విద్యుత్‌ బిల్లులో సగానికి పైగా అదనపు ఛార్జీల భారమే ఉంటుంది. గత వైసిపి పాలనలో ఏడుసార్లు అదనపు ఛార్జీల భారం వడ్డించగా, కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలలో నవంబర్‌ నుంచి అదనపు ఛార్జీల భారం మోపింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమంటూ చెప్పుకుంటూ వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌ వరుస విద్యుత్‌ ఛార్జీల వడ్డన సాగిస్తోంది. ప్రస్తుతం ఎండ పెరగడంతో విద్యుత్‌ వాడకం మరింత ఎక్కువ అవకాశం ఉంది. వచ్చే నెలలో కరెంట్‌ అదనపు ఛార్జీలతో ఎంత కరెంట్‌ బిల్లు వస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఎఫ్‌పిపిసిఎ, ట్రూ ఆప్‌ సర్దుబాట్లు ఎఫ్‌పిపిసిఎ, ట్రూ ఆప్‌ విద్యుత్‌ ఛార్జీల బిల్లు కన్నా 62 శాతం పైగా వేస్తున్నారు. ఈ అదనపు ఛార్జీల పేరుతో ప్రభుత్వం జనాలను పీల్చిపిప్పి చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్షేమ పథకాల పేరుతో ఇచ్చినట్లే ఇచ్చి ఇతర రూపాల్లో గుంజుకుంటున్నారన్న చర్చ జరుగుతున్నాయి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇక నుంచి అదనపు ఛార్జీల భారాన్ని ఏ నెలకు ఆ నెలలో వసూలు చేయాలన్న ఆలోచన సైతం విద్యుత్‌ శాఖ, ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ మీటర్లతో అధిక బిల్లు దుకాణాలకు స్పాట్‌ మీటర్లు బిగించడం వల్ల అధికం బిల్లు వస్తుందని దుకాణ యజమానులు అంటున్నారు. పాత మీటర్లు ఉన్నప్పుడు బిల్లు తక్కువ వచ్చేదని స్మార్ట్‌ మీటర్లు బిగించిన తర్వాత అధిక స్పీడ్‌ పెరిగి అధిక యూనిట్లు రావడంతో బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. దీనికి తోడు అదనపు ఛార్జీలు మరింత భారంగా మారాయి.- దస్తగిరి, వ్యాపారి, పులివెందులవాడకం కన్నా బిల్లు ఎక్కువ విద్యుత్‌ వాడకం తక్కువైనా కూడా కరెంటు బిల్లు మాత్రం అధికంగా వస్తుంది. మీటర్‌ తిరిగితే వచ్చే బిల్లు కన్నా అదనంగా 62 శాతం అంత కంటే ఎక్కువ ఛార్జీలు వేయడం వల్ల బిల్లు రెట్టింపు అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి పేదలకు బిల్లు భారాన్ని తగ్గించాలి- సుజాత, గహిణి , పులివెందులఅదనపు మోతే అధికం కూలి పనికి పోయి ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి. దీనికి తోడు అదనపు ఛార్జీలు భారంగా మారుతున్నాయి. ఎక్కువ బిల్లు వచ్చే వారిపై అదనపు ఛార్జీలు విధిస్తే బాగుంటుంది. కానీ తక్కువ బిల్లు వచ్చే వారిపైనా విధించడం వల్ల పేదవాళ్లకు మరింత భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం 200 యూనిట్ల వరకు పేదలకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తామని చెప్పి ఇప్పుడు అదనపు ఛార్జీల భారం మోపడం ప్రజలను మోసం చేసినట్టే.-సావిత్రి, వ్యవసాయ కూలీ, పులివెందుల

➡️