ప్రజాశక్తి-ఏలూరు సిటీ : ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో సోమవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. టిడిపి తరఫున నామినేషన్ దాఖలు చేసిన పప్పు ఉమామహేశ్వరరావు, వందనాలు దుర్గ భవాని శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రొసైడింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ పి. దాత్రి రెడ్డి వెల్లడించారు. అనంతరం వారికి ఎన్నికైనట్లు ధ్రువపత్రాలను అందజేశారు.
