ఉత్సాహంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

Mar 31,2024 21:37

ప్రజాశక్తి – ద్వారకాతిరుమల

ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలోని న్యూ కీర్తి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ 14వ వార్షికోత్సవం విద్యార్థులు తల్లిదండ్రులతో ఎంతో ఉత్సాహంగా ఆదివారం సాయంత్రం జరిగింది. విద్యార్థులు వివిధ రకాల డాన్సులు, పాటలతో, వేషాలతో, కోలాటాలతో అలరించారు. స్కూల్‌ కరస్పాండెంట్‌ నల్లూరి సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ స్కూల్‌ 14వ వార్షికోత్సవం విద్యార్థులతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లలకు ఇలాంటి ఈవెంట్స్‌తో ఎంతో ఆక్టివ్‌గా తయారవుతారని అన్నారు. తమ స్కూల్‌లో ఎల్‌కేజి నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇలా వార్షికోత్సవ వేడుకలు స్కూలు యాజమాన్యం నిర్వహించడం వల్ల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ దివ్య పాల్గొన్నారు.

➡️