కరాటే పోటీల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

Feb 12,2024 22:49

ప్రజాశక్తి – చింతలపూడి

ఫిబ్రవరి 11వ తేదీన విజయవాడలో నిర్వహించిన 1వ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ కరాటే పోటీలలో చింతలపూడి శ్రీచైతన్య స్కూల్‌కి చెందిన 16 మంది విద్యార్థులు 19 పతకాలు సాధించిన్నట్లు ప్రిన్సిపల్‌ సురేష్‌ అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం స్వర్ణ పతకాలు సాధించిన విద్యార్థులు నితీష్‌, అయాన్‌, వెండి పతకాలు సాధించిన విద్యార్థులు జెస్వంత్‌, అష్రఫ్‌, కృతిక్‌, అక్షిత్‌ పాల్‌, రజత పతకాలు అంశు(2), జమాల్‌ (2), శ్రీరామ్‌(2), మహిధర్‌, కార్తికేయ, అక్షయ, ప్రాణీత్‌, లిఖిత్‌ వర్ధన్‌, ఫణీంద్ర, మణికంఠ సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను, కోచ్‌ సుమన్‌ రాజులను, ప్రైమరీ ఇన్‌ఛార్జి ఝాన్సీ, ఎఒ రవీంద్ర ప్రశంసించారు.

➡️