‘కార్యకర్తలకు అండగా టిడిపి’

చింతలపూడి: కార్యకర్తలకు టిడిపి ఎప్పుడు అండగా ఉంటుందని చింతలపూడి నియోజకవర్గ యువ నాయకులు సొంగ రోషన్‌ కుమార్‌ అన్నారు. చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో టిడిపి కార్యకర్త పెద్దకర్ల వెంకటేశ్వరరావుకు ప్రమాదం జరిగి ఇంటి వద్ద ఇబ్బందులు పడుతున్న విషయం గ్రామ అధ్యక్షులు, పసునూరి సుబ్బారావు, ఇతర నాయకుల ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సొంగ రోషన్‌ కుమార్‌ వెంటనే స్పందించి వారి ఇంటికి వెళ్లి వెంకటేశ్వరరావును పరామర్శించి అతనికి నెలకు రూ.2 వేలు చొప్పున నాలుగు నెలలు పెన్షన్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామ పెద్దల సమక్షంలో పెన్షన్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో మందపాటి పాపారావు, తాళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️