గుండెపోటుతో వ్యక్తి మృతి

ప్రజాశక్తి – ద్వారకాతిరుమల

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి శనివారం ఉదయం ఆకివీడు గ్రామానికి చెందిన కావిట రాంబాబు(40) తమ కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి మొక్కుబడి నిమిత్తం వచ్చారు. తలనీలాలు సమర్పించుకుని దర్శనార్థం అలిమేటి కళ్యాణ మండపం వద్దకు వచ్చేసరికి ఆకస్మాత్తుగా రాంబాబు కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు దేవస్థానం సిబ్బంది చొరవతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లే మార్గమధ్యలో మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు.

➡️