చలివేంద్రం ప్రారంభం

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌

మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం ఎంపిడిఒ కిరణ్‌ కుమార్‌ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ వేసవిలో బండ్లు వేస్తున్న నేపథ్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మండలంలోని ఇంకా ఎక్కడ అవసరమైతే అక్కడ చలివేంద్రాలని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️