‘జగనన్నను మరలా ఆశీర్వదించాలి’

ప్రజాశక్తి – పోలవరం

సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు కావాలన్నా, కొనసాగాలన్న మళ్లీ జగనే రావాలని, జగనన్నను మరోసారి సిఎం చేసే విధంగా ప్రజల మద్దతు కావాలని పోలవరం నియోజకవర్గ వైసిపి అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి అన్నారు. మండలంలో సోమవారం రాజ్యలక్ష్మి ప్రచారం నిర్వహించారు. పాత పోలవరంలో గ్రామ దేవత కడమ్మ తల్లి అమ్మవారి గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గడపకూ తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. పోలవరం నియోజకవర్గంలో ఒక మహిళా అభ్యర్థి ఇప్పటివరకు గెలవడం జరగలేదు, కాబట్టి ప్రతిఒక్క పథకం అక్కా చెల్లెమ్మల ఖాతాలో జమైనందున, మహిళలంతా ఈసారైనా ఈవిధంగా అన్నకి కృతజ్ఞత చెప్పాలన్నారు. ఒక మహిళా అభ్యర్థిగా గెలిపించి జగనన్నకు బహుమతిగా ఇవ్వాలని పోలవరం నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️