టిడిపి వాణిజ్య విభాగం కార్యదర్శిగా రాము

ముదినేపల్లి: గురజ గ్రామానికి చెందిన టిడిపి సీనియర్‌ నాయకులు అడుసుమిల్లి రామకృష్ణ(రాము)ని జిల్లా టిడిపి వాణిజ్య విభాగం కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు మంగళవారం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో జిల్లా టిడిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు కోట కోటిలింగం బాబు రామకృష్ణకి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి చలసాని జగన్మోహనరావు, టిడిపి నాయకులు పెన్మెత్స వెంకటేశ్వరరాజు, మండల టిడిపి అధ్యక్షులు చళ్లగుళ్ల శోభనాద్రి చౌదరి, కైకలూరు మండల టిడిపి అధ్యక్షులు పెన్మెత్స త్రినాథ్‌ రాజు, వీరాబత్తిన సుధ, పాండు రాముకి శుభాకాంక్షలు తెలిపారు.

➡️