ట్రాక్టర్‌, ఆటో ఢకొీని మహిళ మృతి

మరో ఇద్దరికి గాయాలు
ప్రజాశక్తి – పోలవరం
ఆటో, ట్రాక్టర్‌ ఢకొీని ఒక మహిళ మృతి చెందింది. ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన శనివారం రాత్రి మండలంలోని వెంకటా పురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలవరం ఎస్‌ఐ ఎస్‌ఎస్‌.పవన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని ప్రగడపల్లి గ్రామానికి చెందిన పెనుబాక లక్ష్మి వద్దకు తన సోదరి అయిన నిడదవోలుకు చెందిన మెరుపో రమణమ్మ ఇటీవల వచ్చింది. ఈ క్రమంలో రమణమ్మ కుమార్తెకు అనారోగ్యంగా ఉండడంతో ఆటోలో శనివారం తాళ్లపూడి ఆసుపత్రికి బయలుదేరారు. ఈ క్రమంలో వెంకటాపురం షుగర్‌ ఫ్యాక్టరీ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌, ఆటో ఢకొీన్నాయి. ఈ క్రమంలో ఇద్దరు మహిళలతో పాటు ఆటో డ్రైవర్‌ సీలం రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో పోలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి సిఫార్సు చేశారు. ముగ్గురిని కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో రమణమ్మ (45) మృతి చెందింది. ఆటోడ్రైవర్‌ రాంబాబు, పెనుబాక లక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

➡️