నేలకొరిగిన భారీ వృక్షంతప్పిన ప్రమాదం

ప్రజాశక్తి – ముసునూరు

ఎన్నో సంవత్సరాలు గలిగిన భారీ వృక్షం నేలకొరగడంతో చింతలవల్లి గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఆదివారం మండలంలోని చింతలవల్లి గ్రామంలో 150 సంవత్సరాలు గలిగిన మర్రిచెట్టు ఆర్‌అండ్‌బి రహదారిపై అడ్డుగా పడటంతో ట్రాపిక్‌ స్తంభించింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. నూజివీడు, ముసునూరు మీదుగా వెళ్లే ఆర్‌టిసి బస్సులు వయా చింతలవల్లి వెళ్లకుండా ముసునూరు మీదగా ఏలూరు చేరుతున్నాయి.

➡️