పది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలి

ముసునూరు : ప్రతి ఒక్క 10వ తరగతి విద్యార్థి మంచి మార్కులతో పాస్‌ అవ్వాలని అసిస్టెంట్‌ బిసిఎల్‌ ఫేర్‌ ఆఫీసర్‌ రవి ప్రసాద్‌ అన్నారు. సోమవారం మండలంలోని ముసునూరు బాలుర వసతి గృహం సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల్లో మంచి నైపుణ్యం కలిగిన ఇంగ్లీషు, హిందీ, లెక్కలు, సైన్సు, సోషల్‌ సబ్జెక్టుల్లో ఏ విధంగా ఎక్కువ మార్కులు సంపాదించాలో, ఆ మార్కులు ఎలా రాబట్టుకోవాలో అవగాహన కల్పించారు. బిసిఎల్‌ ఫేర్‌ హాస్టల్‌ వార్డెన్‌ షేక్‌ నజీర్‌, హాస్టల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️