ప్రతిఒక్కరూ ఓటుహక్కు ఉపయోగించుకోవాలి

ప్రజాశక్తి – చింతలపూడి

డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కల్పించిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఫైర్‌ అండ్‌ డిజాస్టర్‌ బిజెపి పివిసి సునీల్‌ కుమార్‌ అన్నారు. చింతలపూడి పట్టణంలో బోయగూడెం, సుప్రీంపేట చర్చిలలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇటీవలే మరణించిన బాలస్వామి కుమార్తె కుటుంబాన్ని, భాను కుటుంబాన్ని, ధర్మాజీ జిల్లా ఎయిమ్‌ కో కన్వీనర్‌ రమేష్‌ భూపతి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ప్రాముఖ్యత కలిగిందన్నారు. స్వచ్ఛందంగా ఓటు వేసి మనందరం దేశం పట్ల ప్రేమ, అభిమానం చాటుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్‌ జిల్లా సెక్రెటరీ పోడేటి రాంబాబు, ఎన్‌ఎస్‌.రాజేంద్ర పాల్గొన్నారు.

➡️