యువతకు వాలీబాల్‌ కిట్లు అందజేత

ప్రజాశక్తి – చాట్రాయి

మండలంలోని పోలవరం గ్రామంలో యువకులకు మాజీ ఎంఎల్‌ఎ, ప్రస్తుతం ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిన్నం రామకోటయ్య ఆధ్వర్యంలో క్రికెట్‌, వాలీబాల్‌ కిట్లు అందజేశారు. రామకోటయ్య అనుచరులు అక్కిరాజు వీర రాఘవ రాజు, ఆయన సతీమణి శ్యామల చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్యామల వీరరాఘవ రాజు మాట్లాడుతూ యువత క్రీడల్లో నైపుణ్యం సాధించాలని, అటువంటి ఆశయంతో రామకోటయ్య యువకులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆయన ప్రోత్సాహంతో ముందుకెళ్లాలని కోరారు.

➡️