రానున్న రోజుల్లో వైసిపికి బుద్ధి చెప్పాలి

టిడిపి ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి గంగిరెడ్ల మేఘలాదేవి

కొయ్యలగూడెం :ఆశ వర్కర్లతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పి గద్ధె దింపాలని టిడిపి ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి గంగిరెడ్ల మేఘలాదేవి పేర్కొన్నారు. కొయ్యలగూడెంలోని ఆమె నివాసం వద్ద ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒకపక్క ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ అంగన్వాడీలు, ఆశవర్కర్లు, పారిశుధ్య కార్మికులతో ఆటలాడుకుంటుందని వైసిపిని విమర్శించారు. ఇటువంటి రాక్షస పాలన నడిపిస్తున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, రానున్న రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో టిడిపిని గెలిపించి, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర దశ, దిశ మార్చుకోవాల్సిందిగా ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ఆమె రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రమా, బి.దేవి, ఝాన్సీ, జయశ్రీ పాల్గొన్నారు.

➡️