వికలాంగుల సేవాసమితి సేవలు అభినందనీయం

ప్రజాశక్తి – భీమడోలు

వికలాంగుల సంక్షేమానికి గుండుగొలను కేంద్రంగా పనిచేస్తున్న శ్రీ విఘ్నేశ్వర వికలాంగుల సేవాసమితి అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో నెలవారీ వితరణలో భాగంగా 55 మంది వికలాంగులకు సన్నబియ్యం, పండ్లు, పౌష్టికాహారాన్ని మంగళవారం అందజేశారు. వీటిని దాత ఇందుకూరి సత్యనారాయణ రాజు తన సమీప బంధువు దాట్ల సూర్యనారాయణ రాజు జ్ఞాపకార్థం అందజేశారని సంఘం ప్రతినిధి శ్యామల రాజు తెలిపారు. ఇదే క్రమంలో ఏలూరుకి చెందిన ఫిజియోథెరపిస్టులు డాక్టర్‌ జి.రాంబాబు, డాక్టర్‌ కంబయ్య వికలాంగులకు వైద్య సేవలను అందించారు. చికిత్స కొనసాగింపుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంఘానికి చెందిన శాశ్వత దాతలు దాట్ల సీతారామరాజు, దాట్ల రామకృష్ణంరాజుతో పాటు సంఘ ప్రతినిధులు జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️