విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి

ప్రజాశక్తి – ద్వారకా తిరుమల

ద్వారకాతిరుమల మండలంలోని కొమ్మర గ్రామంలో శనివారం సాయంత్రం ఐదు గంటలకు విద్యుత్‌ షాక్‌ గురై వ్యక్తి మృతి చెందాడు. సదరు వ్యక్తి విద్యుత్‌ మరమ్మత్తుల నిమిత్తం స్తంభం ఎక్కినట్లు తనతో పాటు పనిచేసే కార్మికులు, గ్రామస్తులు తెలిపారు. వెస్ట్‌ బెంగాల్‌ నుంచి విద్యుత్‌ పనుల నిమిత్తం వచ్చినట్లుగా తోటి కార్మికులు అన్నారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని పలువురు తెలియజేశారు.

➡️