ప్రజాశక్తి – ఏలూరు
బాల అయ్యప్ప క్షేత్రం దొండపాడు, ఏలూరు వారు నిర్వహించిన చిత్రలేఖనం ముగ్గుల పోటీల్లో కె.గాయత్రి(6వ తరగతి) జెడ్‌పిహెచ్, శనివారపు పేట విద్యార్థినికి ద్వితీయ బహుమతి లభించింది. సోమవారం మకరజ్యోతి ఉత్సవాల్లో బహుమతిని అందుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.ప్రకాష్‌రావు, ఫస్ట్ అసిస్టెంట్ కె.రాజ్‌కుమార్, పాఠశాల కమిటీ, పేరెంట్స్ కమిటీ, పాఠశాల సిబ్బంది విజేతను, చిత్రలేఖనం ఉపాధ్యాయుడు ఎమ్‌డి.ఇర్షాద్ అహ్మద్‌ను అభినందించారు.