తాగునీటి సమస్యలు నిర్మూలించడమే లక్ష్యం

ప్రజాశక్తి – బుట్టాయగూడెం

ప్రజలు తాగునీటి సమస్యలతో పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని వెంటనే వాటర్‌ ట్యాంక్‌ల పనులు చేపట్టామని, తాగునీటి సమస్యలు పూర్తిస్థాయిలో నిర్ములించాలనే లక్ష్యంతో ఉన్నామని పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు తెలిపారు. మండలంలోని కోటనాగవరం పంచాయతీ పరిధిలో రూ.58 లక్షలతో నిర్మిస్తున్న రెండు వాటర్‌ ట్యాంక్‌లకు శంకుస్థాపన చేసి, పనులను పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు, నియోజకవర్గం ఇన్‌ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి మొడియం రామతులసి, వైస్‌ ఎంపిపిలు గుగ్గులోతు మోహన్‌రావు, కుక్కల వరలక్ష్మి, స్థానిక సర్పంచి తెల్లం వెంకటలక్ష్మి ఉపసర్పంచి శ్రీను, స్థానిక వైసిపి నాయకులు తాళ్లూరి ప్రసాద్‌, కుక్కల లచ్చిపండు, జిసిసి స్టేట్‌ డైరెక్టర్‌ తెల్లం చిన్నారావు, ఎస్‌సి సెల్‌ జిల్లా సెక్రెటరి నక్కా శివాజీ పాల్గొన్నారు.

➡️