కలిదిండి : నిరుపేదలకు సాయం అందించడం అభినందనీయమని కైకలూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సర్పంచి మసిముక్కు మారుతీ ప్రసన్న, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి శ్రీదేవి, మానవత సేవా సంస్థ ఛైర్మన్ పేటేటి వివేకానంద, అద్యక్షులు గోదావరి సత్యన్నారాయణ, నాయకులు ఎం.వెంకటేశ్వరరావు, మారుబోయిన రత్నారావు, చక్కా జగన్మోహనరావు, ప్రత్తి శ్రీను పాల్గొన్నారు.
