ప్రజల ఆశీర్వాదమే కొండంత బలం

14వ డివిజన్‌లో ఎంఎల్‌ఎ ఆళ్ల నాని పర్యటన
ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌
ప్రజల ఆశీర్వాదమే తమకు కొండంత బలమని ఏలూరు ఎంఎల్‌ఎ, వైసిపి జిల్లా కార్యదర్శి ఆళ్ల నాని అన్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన 14వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి హయాంలో ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. నగరంలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. గోదావరి జలాలను మళ్లించి విలీన గ్రామాల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి నాలుగున్నరేళ్ల కాలంలో వైసిపి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా చేకూరిన లబ్ధిని వివరించే బ్రోచర్లను అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ దారపు అనూష తేజ, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, డిప్యూటీ మేయర్లు నూకపెయ్యి సుధీర్‌బాబు, గుడిదేసి శ్రీనివాసరావు, వైసిపి నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్‌, జిల్లా కోశాధికారి మంచెం మైబాబు, ఎఎంసి ఛైర్మన్‌ నెరుసు చిరంజీవులు, వైస్‌ ఛైర్మన్‌ కంచన రామకృష్ణ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

➡️