ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్న ప్రభుత్వం

ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ అన్నారు. రైల్‌రోకో, రైల్వే స్టేషన్ల ఎదుట కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవని, కార్యక్రమంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టూ టౌన్‌ పోలీసులు నోటీసు ఇవ్వడం ప్రజాస్వామ్య హక్కులను హరించి వేయడమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు. రైల్‌ రోకో, రైల్వే స్టేషన్‌ ఎదుట ఎటువంటి ఆందోళన కార్యక్రమాలకు తాము పిలుపు ఇవ్వకపోయినా ఎవరో ఇచ్చిన పిలుపునకు నోటీసులు ఇచ్చి ఆందోళనకు గురి చేయడం అన్యాయమన్నారు. శనివారం టూ టౌన్‌ పోలీసు వారి నుంచి నోటీసు తీసుకున్న అనంతరం ఆయన ఏలూరు అన్నే భవనంలో మీడియాతో మాట్లాడారు. తనతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులకు, కార్యకర్తలకు పోలీసులు ముందస్తు నోటీసుల ఇచ్చారన్నారు. ముందస్తు నోటీసుల పేరుతో పోలీసులు హడావుడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నూజివీడు మండలంలోని గొల్లపల్లిలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, పెదపాడు మండలంలోని రాజుపేటలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుండపనేని సురేష్‌, మరికొంతమంది నాయకులకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చారని తెలిపారు. పిలుపు ఇవ్వని కార్యక్రమానికి నోటీసులు ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతు ఉద్యమాన్ని అణిచి వేయాలని నిరంకుశ నియంతృత్వ చర్యలకు పాల్పడుతోందని విమ ర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం చాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసులతో నిర్బంధ చర్యలకు పూను కుంటుందన్నారు. ఇదేనా రైతులకు చేసే మేలు అని ప్రశ్నించారు. పోలీసు నిర్బంధాలతో రైతు ఉద్యమం ఆగదని, మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. ఆందో ళనకు ఎవరు పిలుపునిచ్చారో తెలు సుకోకుండా ఎవరు ఆందోళనకు పిలిపించినా తమకు నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేయడం పోలీసులకు తగదన్నారు. ఉద్యమాలపై నిర్బంధ చర్యలు మానుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని కోరారు.అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరుసిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ అన్నారు. తనకు సంబంధం లేదని చెబుతున్నప్పటికీ ఈ నెల పదో తేదీన రైల్‌ రోకో కార్యక్రమంలో పాల్గొనకూడదంటూ మూడో పట్టణ పోలీసులు నోటీసు ఇచ్చి, తనను గృహనిర్బంధం చేయడం పట్ల ఆయన పోలీసుల ప్రవర్తన తీరును తీవ్రంగా ఖండించారు. శనివారం డేగా ప్రభాకర్‌ గృహానికి వెళ్లి నోటీసులు అందించి హౌస్‌ అరెస్టు చేస్తున్నట్లు తెలపడంతో ప్రభుత్వ నిర్బంధం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పదో తేదీన ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెప్పినా వినకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల అభ్యంతరం తెలిపారు. అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని, భవిష్యత్తులో ప్రజలు ఈ చేతకాని, అసమర్ధ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. భీమడోలు : రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించాలని పదో తేదీన రైల్‌ రోకోలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భీమడోలు పోలీసులు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజుకు నోటీసు ఇచ్చారు. పూళ్ల గ్రామంలో కౌలు రైతుల సంఘం జిల్లా కో-కన్వీనర్‌ శ్రీరామచంద్రమూర్తికి పోలీసులు నోటీస్‌ ఇచ్చారు.

➡️