ప్రత్యేక డిఎస్‌సి సాధనకు 10న మన్యం బంద్‌

ప్రజాశక్తి – బుట్టాయగూడెం

రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఈనెల 9వ తేదీ లోపు ఆర్డినెన్సు జారీ చేయకపోతే ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా ఏజేన్సీ మన్యం బంద్‌ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, కార్యదర్శి దర్ముల రమేష్‌ అన్నారు. స్థానిక ఆదివాసీ విజ్ఞాన కేంద్రంలో సంఘం జిల్లా కమిటీ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షులు తెల్లం దుర్గారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో 100 శాతం ఉద్యోగాలు ఆదివాసీలకు ఇవ్వాలన్నారు. జిఓ నెంబర్‌ 3 రిజర్వేషన్‌ కోసం టిఎసి తీర్మానం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసి స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని లేనిచో ఈనెల 10న బంద్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు నాగేశ్వరావు, సుండ్రు బుల్లెమ్మ, కార్యదర్శులు కారం భాస్కర్‌, మడకం ఏసుబాబు, తెల్లం వెంకటలక్ష్మి, పట్ల లక్ష్మయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.నాగమణి, వ్య.కా.స జిల్లా ఉపాధ్యక్షులు తామా ముత్యాలమ్మ పాల్గొన్నారు.

➡️