వాహనదారులు హెల్మెంట్‌ ధరించాలి

ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌

అతివేగం వాహనదారుల ప్రాణాలను హరించి వేస్తుందని పెదపాడు ఎస్‌ఐ శుభశేకర్‌ తెలిపారు. తలపాడు మండలం కలపర్రు టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం పెదపాడు ఎస్‌ఐ శుభ శేఖర్‌ వాహనదారులకు హెల్మెట్‌ వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టోల్‌గేట్‌ను దాటి వెళ్లు ప్రజలకు, హెల్మెట్‌ వాడకుండా వాహనాలు నడిపే వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వాహన ప్రమాదాలలో ఎక్కువ మంది హెల్మెట్‌ వాడకుండా రోడ్డు ప్రమాదాలకు గురైన సమయంలో మృతి చెందిన వారేనని ఆయన తెలిపారు. హెల్మెట్‌ వాడకం వల్ల ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయట పడవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

➡️