మండవల్లి : విద్యార్థులు తీసుకునే ప్రతి నిర్ణయం ఉన్నత శిఖరాలను చేరుకునే విధంగా ఉండాలని ప్రొఫెసర్ సుధా బత్తుల విజయకుమార్ పేర్కొన్నారు. మండలంలోని కానుకలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం పదవ తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య ఉపాధి వృత్తి అవకాశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పాస్ అయిన తర్వాత తీసుకునే నిర్ణయం ఉజ్వల భవిష్యత్తుకు పునాదిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ఎల్‌ఎస్.భాస్కరరావు, ప్రధానోపాధ్యాయులు మాధవ కుమార్, ఉపాధ్యాయులు శ్యాంప్రసాద్, శివకుమార్, భాగ్య కుమారి పాల్గొన్నారు.
