ఉచిత న్యాయ సలహాలకు 15100

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్‌
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్‌ శుక్రవారం తంగెళ్లమూడిలోని విన్సెంట్‌ డి పాల్‌ మానసిక విభిన్న ప్రతిభావంతుల వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలో అందిస్తున్న వైద్య, ఆహార సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మానసిక విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ పథకాలను పొందటంలో, ఆస్తులు పొందడంలో సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. ఎటువంటి న్యాయ సలహాలకైనా 15100 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం లో సిస్టర్‌ అన్నే డిసి, ప్యానల్‌ లాయర్‌ పి.వెంకటేశ్వరరావు, పారా లీగల్‌ వాలంటీర్‌ ఎం.మోహన్‌రావు పాల్గొన్నారు.

➡️