చనుబండలో ‘పొలం పిలుస్తుంది’

చాట్రాయి : సస్యరక్షణ చర్యలు తీసుకొని మొక్కజొన్న పంటను చీడ పీడల నుంచి కాపాడుకొని, అధిక దిగుబడులు సాధించాలని జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాస రావు సూచించారు. బుధవారం ఉదయం మండలంలోని చనుబండ గ్రామంలో మండల ఎఇఒ ఉదరు భాస్కర్‌ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. చనుబండ గ్రామంలో రైతులతో కలసి మొక్కజొన్న పంట చేలను ఎఇఒ, విహెచ్‌ఎలు పరిశీలించారు. పంటలో ఉన్న పురుగుకు ఏ పురుగు మందులు ఎంత మోతాదులో పిచికారీ చేయాలో రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలను పాటించి మేలైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని ఉదరు భాస్కర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ బి.శివశంకర్‌, కూటమి నాయకులు ప్రదీప్‌, గవర వెంకటేశ్వర రావు, బన్నె గోపాలకృష్ణ, మోరంపూడి. రమేష్‌, రైతులు పాల్గొన్నారు.

➡️