ప్రజాశక్తి-చింతలపూడి : ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో వంద పడకల ఆస్పటల్ పనులను నాశిరకంగా చేస్తున్నారు. ఇసుక తోటల్లో ఇసుక తీసుకొచ్చి పనులు చేస్తున్నట్లు పట్టణ వాసులు తెలిపారు. కాంట్రాక్టర్ ఇచ్చే మావుళ్ళు మత్తులో ఆఫీసర్స్ ఉన్నారని వారు ఆగ్రహిస్తున్నారు. అటువైపు కన్నెత్తి చూడని అధికారులు తక్షణమే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ , నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.