బైక్‌ అదుపుతప్పి వ్యక్తి మృతి

ప్రజాశక్తి – జీలుగుమిల్లి
బైక్‌ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని తాటిరామన్నగూడెం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన మడకం చిన్న దుర్గారావు(47) శుక్రవారం రాత్రి బైక్‌పై రాచన్నగూడెం వెళ్తుండగా మార్గ మధ్యలో కుక్కను తప్పించబోయి అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన దుర్గారావును కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని ప్రయివేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ రాధాకృష్ణ తెలిపారు.
ముగ్గురికి రిమాండ్‌
       నూజివీడు టౌన్‌ : నూజివీడు ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో ఎక్సైజ్‌ నేరాలకు పాల్పడుతూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్న మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురిని అరెస్ట్‌చేసి రిమాండ్‌ నిమిత్తం నూజివీడు కోర్ట్‌కు తరలించినట్లు ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ సిఐ ఎ.మస్తానయ్య తెలిపారు. ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో నాటు సారా తయారుచేసిన, అమ్మిన, కలిగి ఉన్నవారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

➡️