పోలీస్‌ శాఖ ప్రక్షాళనకు చర్యలు

దెందులూరు ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌
ప్రజాశక్తి – దెందులూరు
గత ఐదేళ్లలో వైసిపి దుర్మార్గపు పాలనలో సామాన్య ప్రజలపై జరిగిన ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, దాడులకు కొందరు పోలీస్‌ సిబ్బంది సైతం అండగా నిలిచి సామాన్య ప్రజల్లో పోలీస్‌ శాఖపై ఉండే నమ్మకాన్ని నాశనం చేశారని దెందులూరు ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. అందువల్లే ప్రజల్లో పోలీస్‌ శాఖపై ఉండే భరోసాను తిరిగి కల్పించేలా టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్ర పోలీస్‌ శాఖను సైతం పూర్తిగా ప్రక్షాళన చేస్తూ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్‌పి(అడ్మిన్‌)గా ఇటీవల భాద్యతలు చేపట్టిన నక్కా సూర్యచంద్రరావు గురువారం ఎంఎల్‌ఎ చింతమనేనిని ఆయన క్యాంపు మర్యాదపూర్వకంగా కలిసి పూల మెక్కను అందించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో వారి అనుభవాన్ని ఉపయోగించి మెరుగైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్‌ (మిల్లు బాబు), లావేటి శ్రీనివాస్‌, బొప్పన సుధ, నంబూరి నాగరాజు, పార్టీ నాయకులు తాతా సత్యనారాయణ, పర్వతనేని రామకృష్ణ, (సీతంపేట), జమలయ్య పాల్గొన్నారు.

➡️