ప్రజాశక్తి – ముసునూరు
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటానికి అట్లూరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత అట్లూరి రవీంద్ర ముందు ఉంటారని నిరూపించుకున్నారు. గత ఆదివారం రాత్రి జరిగిన గోపవరం గ్రామంలో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కోడె శ్రీనివాసరావు కుటుంబాన్ని అట్లూరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత అట్లూరి రవీంద్ర పరామర్శించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్రీనివాసరావు, మాజీ సర్పంచి ధర్మరాజు, మాజీ ఎంపిటిసి శ్రీను, నాగార్జున పాల్గొన్నారు.