జర్నలిస్ట్ కుటుంబానికి అండగా 

May 25,2024 12:52 #Eluru district

ప్రజాశక్తి-చింతలపూడి : ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఏలూరు టైమ్స్ సీనియర్ జర్నలిస్ట్ అశోకవర్ధన్ మృతికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. చింతలపూడి ప్రజాశక్తి రిపోర్టర్ అశోక్ వర్ధన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించమని కోరగానే ఎంతోమంది సహృదయంతో తమ వంతు ఆర్థిక సహాయం అందించి ఉన్నారు. వారందరి తరఫున 33100/-అశోక్ వర్ధన్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన పార్టీ చింతలపూడి మండల పార్టీ ప్రెసిడెంట్ చిదరాల మధు బాబు మరియు నాయకులు కార్యకర్తలు తమ వంతు సహాయంగా 11 వేల రూపాయలు అందించడం జరిగింది. అశోక్ వర్ధన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా రాబోయే రోజుల్లో వారికి ఎలాంటి సమస్య వచ్చిన మేమున్నామంటూ వారికి ధైర్యాన్ని ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు. ఈ సందర్బంగా సహకరించిన ప్రతి ఒక్కరికి అశోక్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

➡️