అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి సాయం

ప్రజాశక్తి – ముదినేపల్లి

మండలంలోని కొరగుంటపాలెం గ్రామంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన ముచ్చు వెంకయ్య తాటాకు ఇంటికి భోగి రోజు ఉదయం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంటిలో వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌ అంబుల వైష్ణవి తన తండ్రి డాక్టర్‌ మనోజ్‌కు తెలిపింది. దీంతో మనోజ్‌ గురువారం ఆ గ్రామం వెళ్లి ముచ్చు వెంకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రూ.5 వేలు నగదు, దుస్తులు అగ్ని బాధితులకు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పేరే రామకృష్ణ పాల్గొన్నారు.

➡️