వినియోగంలోకి ఎటిఎం, సిడిఎం

ప్రజాశక్తి వార్తకు స్పందన

ప్రజాశక్తి – ముదినేపల్లి

మండల కేంద్రమైన ముదినేపల్లిలో ఎస్‌బిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎటిఎం, సిడిఎం ఎట్టకేలకు వినియోగంలోకి వచ్చాయి. ముదినేపల్లిలోని ఎస్‌బిఐ ఎటిఎం, సిడిఎం తరచూ మొరాయిస్తూ ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎటిఎం, సిడిఎం గత కొన్ని రోజులుగా పనిచేయకపోవడంతో ఖాతాదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమస్యపై గురువారం ప్రజాశక్తి దినపత్రికలో ఎటిఎం ఎనీ టైం మరమ్మతులు అనే శీర్షికతో వార్త వెలువడిన విషయం పాఠకులకు విధితమే. దీనిపై స్పందించిన బ్యాంకు అధికారులు గురువారం సాయంత్రానికి ఎటిఎం, సిడిఎంలకు మరమ్మతులు చేపట్టారు. దీంతో రెండు మిషన్లు వినియోగంలోకి వచ్చాయి. దీంతో వినియోగదారులు ఎటిఎంకు వచ్చి నగదు డ్రా చేసుకుంటూన్నారు. ఎటిఎం, సిడిఎం వినియోగంలోకి రావడంతో ఖాతాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

➡️