ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ గురువారం ప్రపంచ మానసిక విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా స్థానిక తంగేళ్లమూడిలోని మిషనరీ ఆఫ్ ఛారిటీ వారు నిర్వహిస్తున్న హోమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోమ్‌లో ఉన్న వారికి అందిస్తున్న సదుపాయాల పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, ఆహార సదుపాయాల పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి ప్రభుత్వ పథకాలు పొందటంలో కాని, వారికి ఏమైనా ఆస్తులు ఉన్న వాటిని పొందడంలో ఎదురయ్యే న్యాయ సమస్యలపై ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ లాయర్ పి.వెంకటేశ్వరరావు, సంస్థ యాజమాన్యం పాల్గొన్నారు.
