టి.నరసాపురం: విద్యార్థులు విద్యతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఎస్‌ఐ ఎం.జయబాబు సూచించారు. మండలంలోని బొర్రంపాలెం జెడ్‌పి హైస్కూల్లో శుక్రవారం పోలీసులు బాలబాలికలకు పోక్సో, పలు చట్టాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ఎవరైనా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా కొన్ని నేరాలను అదుపు చేయవచ్చన్నారు. ఎఎస్‌ఐ వి.విజరు కుమార్ ఉన్నారు.
