నవోదయం 2.0పై అవగాహన

ఆగిరిపల్లి : గ్రామాల్లో నాటు సారా తయారు చేసినా, అమ్మినా, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని నూజివీడు ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.మస్తానయ్య హెచ్చరించారు. మంగళవారం ఉన్నతాధికారుల ఆదేశానుసారం మండల పరిధిలోని ఆగిరిపల్లి, ఈదర, నెక్కలం, గొల్లగూడె, సింహాద్రి అప్పారావుపేట గ్రామాల్లో నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్‌ కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 అనే కార్యక్రమంలో భాగంగా నాటు సారాయి రహిత ప్రచార రధం ద్వారా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, సచివాలయ సిబ్బంది, ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఉనికిలిలో ‘సిలువు మార్గం’

మండవల్లి : పాపము నుంచి మానవులను రక్షించడానికి ఏసుప్రభు సిలువ శ్రమలను అనుభవించారని రెవరెండ్‌ ఫాదర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. క్రైస్తవులు భక్తి శ్రద్ధతో నిర్వహించుకునే సిలువ శ్రమ దినాలను పురస్కరించుకొని ఉనికిలిలో సిలువు మార్గ కార్యక్రమాన్ని క్రైస్తవ విశ్వాసులు ఆర్‌సిఎం చర్చి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆర్‌సిఎం సంఘ పెద్దల పాల్గొన్నారు.

➡️