అక్రమార్కుల చెరలో కాలువ గట్టు

చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ గట్టు భూమిలోదర్జాగా సాగు చేసుకుంటున్న భూస్వాములు
పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి – టి.నరసాపురం
మండలంలోని కృష్ణాపురం, పుట్రేపు గ్రామాల మధ్యలో ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ గట్టు ఆక్రమణకు గురైంది. కొందరు ఆక్రమణదారులు కాలువ గట్టు భూమిని ఆక్రమించి దర్జాగా సాగు చేసుకుంటున్నారు. సుమారు వందల ఎకరాలకు పైగా మిగులు భూమిలో స్థానిక భూస్వాములు కొందరు భూమి చుట్టూ ఫెన్సింగ్‌ వేసుకుని మరీ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆ భూముల్లో మొక్కజొన్న, పామాయిల్‌ వంటి పంటలు సాగు చేసుకుని కాసులు దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, అదే పేదలు ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగుచేస్తే వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారని, పెద్దలు చేస్తే మాత్రం నిమ్మకు నీరేత్తనట్లు అధికారులు వ్యవ హరిస్తున్నారని స్థా నికులు విమ ర్శిస్తున్నారు. వె ంటనే ఉన్న తస్థాయి అది óకారులు స్ప ందించి ఆక్ర మణలు తొల గించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.సుమారు 15 ఏళ్ల క్రితం పోలవరం ప్రాజెక్టు నుంచి చింతలపూడి మెట్ట ప్రాంతానికి సాగునీటిని అందించేందుకు చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం భూ సేకరణ చే శారు. తరువాత తవ్వ కాలు కూడా జరిగాయి. మం డలంలోని మక్కి నవారిగూడెం, గం గినీడుపాలెం, బండి వారిగూడెం, పుట్రేపు, కృష్ణాపురం గ్రామాల మీదుగా కాలువ తవ్వకాలు సాగాయి. అయితే నిధుల కొరత, చింతలపూడి రైతులు అధిక నష్టపరిహారం కోసం కోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో పదేళ్ల క్రితం తవ్వకాలు నిలిచిపోయాయి. ఇటీవల గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి కాంట్రాక్టు దారులు కృష్ణాపురం, పుట్రేపు మధ్య కాలువ గట్టు మట్టిని తవ్వి హైవేకి తరలించారు. దీంతో కాలువ గట్టుపై ఉన్న మట్టి ఖాళీ అవ్వడంతో ఇదే అదునుగా భావించిన స్థానిక భూస్వాములు కొందరు ఆ మిగులు భూములను ఆక్రమించి జెసిబిలతో చదును చేయించుకుని కాలువ వెంబడి భూముల చుట్టూ ఫెన్సింగ్‌లు సైతం ఏర్పాటు చేసుకుని దర్జాగా సాగు చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఆ భూముల్లో మొక్కజొన్న, పామాయిల్‌, కోకో పంటలు సాగు చేసుకుని లాభాలు పొందుతున్నారని పలువురు చెప్పుకుంటున్నారు. కాలువ గట్టు భూములు ఆక్రమణకు గురవ్వడం ద్వారా స్థానిక గ్రామాలకు చెందిన రైతులు, పేదలు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని, భూస్వాములకు కొమ్ము కాస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను పేదలు ఆక్రమిస్తే మాత్రం వారిపై కేసులు పెట్టి బెదిరిస్తారని, భూస్వాములు ఆక్రమిస్తే చర్యలేవని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆక్రమణలు తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

➡️