యువతిని వేధిస్తున్న వ్యక్తిపై కేసు

ఏలూరు స్పోర్ట్స్‌ : యువతిని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై ఏలూరు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నూజివీడు ప్రాంతానికి చెందిన రామిశెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్‌ బాలు అతను స్థానికంగా మంజీరగళం అనే స్థానిక పత్రికలో విలేకరిగా పని చేస్తూ ఉంటాడని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. నూజివీడు ప్రాంతానికి చెందిన యువతి అతను నివాసం ఉండే ఏలూరు నగరంలోని ప్రయివేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో ఉమామహేశ్వరరావు ఆమెను పరీక్షల సమయంలో కూడా తరచూ వేధించ సాగాడు. చివరికి చేసేదేమీ లేక అతను తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఏలూరు మూడో పట్టణ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. మూడు సెక్షన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని మూడో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

➡️