ప్రజాశక్తి – ఏలూరు టౌన్
దెందులూరు నుంచి 26 వేలకుపైగా మెజారిటీతో టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా గెలుపును సొంతం చేసుకున్న చింతమనేని ప్రభాకర్‌ని బుధవారం నియోజక వర్గానికి చెందిన పలువురు కలిసి పూలబోకెలు, పూలమాలలతో అభినందిం చారు. నియోజకవర్గంలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల నుంచి చింతమనేని అభిమానులు, టిడిపి కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు దుగ్గిరాలకు చేరుకొని ఆయనను అభినందించారు.
