రాజారావుకు అభినందన

ప్రజాశక్తి – దెందులూరు

ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో జిల్లాకు చెందిన ఏలూరు నగర శాఖ ప్రధాన కార్యదర్శి జొన్నకూటి రాజారావుకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమ గీతాల విభాగంలో ప్రథమ బహుమతి, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బుర్రకథ విభాగంలో అతని బృందానికి ప్రథమ బహుమతి లభించింది. ఈ సందర్భంగా కాకినాడలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన స్వర్ణోత్సవ సంబరాలలో యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ చేతుల మీదుగా బహుమతిని అందుకున్న జొన్నకూటి రాజారావుకు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నక్క వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్‌ ముస్తఫ్‌ అలీ, ఆర్‌.రవికుమార్‌, జిల్లా కార్యవర్గం, పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.

➡️