ఎంఎల్‌ఎ సొంగ రోషన్‌కుమార్
ప్రజాశక్తి – చింతలపూడి
సీసీ రోడ్లు, డ్రెయిన్స్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని చింతలపూడి నియోజకవర్గ ఎంఎల్‌ఎ సొంగ రోషన్‌కుమార్ అన్నారు. చింతలపూడి ఎంఎల్‌ఎ కార్యాలయం వద్ద శుక్రవారం కామవరపుకోట మండలం ఎన్‌ఆర్‌ఇజిఎస్ కాంట్రాక్టర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, నియోజకవర్గంలో రోడ్లకు మహర్ధశ వచ్చిందని అన్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని రోడ్లు, డ్రెయిన్స్ నిర్మాణ పనులు పారదర్శకంగా జరగాలని అన్నారు. సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణ విషయంపై పలు సూచనలు చేశారు. రోడ్లు నాణ్యతగా ఉండాలని, ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రజల శ్రేయస్సును కాంట్రాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని పనులు వేగవంతంగా, నాణ్యతగా జరిగేటట్లు చూసే బాధ్యత మీపై కూడా ఉందని పేర్కొన్నారు.