ప్రజాశక్తి – బుట్టాయిగూడెం
అంతర్వేదిగూడెంలో అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధమై నిరాశ్రయులైనవారికి సిపిఎం నాయకులు సాయం అందించారు. శనివారం షార్ట్‌సర్క్యూట్‌తో తాటాకిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో నిరాశ్రయులైన రాంపండు కుటుంబానికి సిపిఎం బుట్టాయగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో సాయం అందించారు. రూ.ఐదు వేల నగదు, రైస్ ప్యాకెట్ అందించారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలోని సిపిఎం మండల కమిటీ సభ్యులు కారం ముత్యాలరావు, పోలోజు నాగేశ్వరరావు, ఉడతా వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
