పలువురి సంతాపం
ప్రజాశక్తి – పెదపాడు
సిపిఎం పెదపాడు గ్రామ నాయకులు, శాఖా సభ్యులు ముసునూరి కొండలరావు (72) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన సిపిఎంలో సుదీర్ఘకాలం పాటు గ్రామస్థాయిలో పని చేశారు. ఆదివారం పెదపాడులోని ఆయన ఇంటి వద్ద భౌతికకాయంపై సిపిఎం జిల్లా, గ్రామ నాయకులు ఎర్రజెండా కప్పి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఆయన మృతికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.శ్రీనివాస్, పి.రామకృష్ణ మాట్లాడుతూ ముసునూరి కొండలరావు సిపిఎం నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం కార్యకర్తగా తన వంతు కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖా కార్యదర్శి గుండపనేని సురేష్, సిపిఎం నాయకులు షేక్ కరీముల్లా, మేడేపల్లి దాసు, షేక్ షఫీరా, పలువురు సిపిఎం సానుభూతిపరులు పాల్గొన్నారు.
