పంట బీమా తప్పనిసరి

ప్రజాశక్తి – ముసునూరు

ప్రతి ఒక్క రైతు తాము వేసిన పంటను బీమా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సూరిబాబు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని సూరేపల్లి, రమణక్కపేట గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు వేసిన పంటను బట్టి ప్రీమియం చెల్లించుకోవాలని, మొక్కజొన్న పంటకు రూ.483, మినుములు రూ.60, వరి పంట రూ.500, మామిడి పంటకు రూ.2,250, మిగతా పంటలకు ఆయా గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో, సచివాలయ సిబ్బందిని అడిగి పంట ధృవీకరణ పత్రం కూడా తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

➡️