‘చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం’

టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి కొలుసు పార్థసారథి

ప్రజాశక్తి – ముసునూరు

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కావాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని టిడిపి నూజివీడు నియోజకవర్గ ఎంఎల్‌ఎ అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్థసారథి మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ ఎన్‌డియే కూటమితో మాత్రమే సహకారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️